
243views
శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో రూ.2,67,88,598 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 23 రోజుల్లో సమర్పించారు. నగదుతోపాటు 301 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 500 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 1517 యూఎస్‌ఏ డాలర్లు, 20 కెనడా డాలర్లు, 25 ఇంగ్లాండ్ ఫౌండ్స్ మొదలైన విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో శివసేవకులు, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న పాల్గొన్నారు.





