News

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖను భగ్నం చేసేందుకు మలప్పురంలో సీపీఎం గూండాల యత్నం!

361views

కొచ్చి (VSK) – కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో గత ఫిబ్రవరి 6, 2023 రాత్రి సిపిఎం, డివైఎఫ్‌ఐ గూండాలు… ఆర్‌ఎస్‌ఎస్ శాఖను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. శాఖ కార్యక్రమం శాంతియుతంగా, మామూలుగా క్రమశిక్షణతో సాగుతుండగా.. కొట్టక్కల్ శివాలయం ప్రాంగణంలోని సంఘస్థాన్‌కు వారు వచ్చారు. శాఖ సంఘ ప్రార్థనకు ముందు ఆయా పార్టీలకు చెందిన వారు వచ్చి ” మీ కార్యక్రమాలు ఆపకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మీ చేతులు, కాళ్లు నరికి పక్కనే ఉన్న కాల్వలోకి విసిరేస్తాం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ స్థానిక మండల ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ స్వయం సేవక్‌ జయన్‌ తేలపురత్‌ మాట్లాడుతూ.. తాము అనుమతులతోనే ఆర్‌ఎస్‌ఎస్ శాఖ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ కార్యక్రమాలను ఆపమని చెప్పే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని తెలిపారు. ఎవరికీ బయపడకుండా.. స్వయం సేవకులు సంఘ్ ఆచారపద్ధతి ప్రకారం శాఖను ముగించినట్లు ఆయన తెలిపారు.

ఈ సంఘటన చూస్తే జాతీయవాద శక్తులను రెచ్చగొట్టి… భౌతిక ఘర్షణలు సృష్టించి లౌకికవాదం ప్రమాదంలో పడిందని ఏడ్చే విలక్షణమైన సిపిఎం పద్ధతి అని స్ఫష్టమవుతుంది. ముస్లిం మెజారిటీ ఉన్న జిల్లాలో ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్దతులు ఉన్నాయి. కానీ.. ఇలా హిందువులను బెదిరించి, భయపెట్టాలనుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం పిరికిపంద చర్య అవుతుంది.

source- vsk bharath