News

గిరిజనుల మత మార్పిడులపై ఈ నెల 12న అస్సాంలో ర్యాలీ

311views

భారతదేశంలో మత మార్పిడులు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఈ పెను ముప్పు నిరంతరం ఇబ్బంది కలుగజేస్తూనే ఉంది. అస్సాంలోని గిరిజనులను విదేశీ మతాల్లోకి మార్చడం కొత్త సంఘటన కాదు కానీ గత కొన్ని దశాబ్దాల్లో మతమార్పిడి రేటు బాగా పెరిగింది. మత మార్పిడికి గిరిజనులే సులువుగా మార్చవచ్చని క్రైస్తవ మత పెద్దలు నమ్ముతుంటారు. దీంతో చాప కింద నీరులా ఆయా మతాలు గిరిజన సంఘాలను ప్రభావితం చేస్తున్నాయి.

గిరిజనుల ఉనికిని వారి సంస్కృతి, ఆచారాలు మరియు భాషలతో రక్షించేందుకు అస్సాం ప్రదేశ్ “జనజాతి ధర్మ సంస్కృతి సురక్షా మంచ్” 2023 ఫిబ్రవరి 12న ఖానాపరా ఫీల్డ్‌లో ఉదయం 10.00 గంటలకు భారీ ర్యాలీ “చలో దిస్పూర్” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అస్సాంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు లక్ష మందికి పైగా గిరిజనులు తమ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. తాము ఏ మతానికి లేదా కులానికి వ్యతిరేకం కాదని.. కానీ మా “గౌరవం మరియు వాస్తవికతతో కూడిన గుర్తింపు”ని కాపాడుకోవడానికి ర్యాలీ చేపుడుతున్నామన్నామని అస్సాం ప్రదేశ్‌ సభ్యులు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులు ఇలా..
భారతీయ రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగలకు ఆర్టికల్ 342లోని రిజర్వేషన్ నిబంధనల ఉద్దేశ్యం గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, ఆచారాలు మొదలైనవాటిని సంపూర్ణంగా రక్షించడం అని అర్థం. అదే విధంగా గిరిజనులు విద్య, ఉద్యోగాల పరంగా ఉన్నత స్థాయికి ఎదిగి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 కొన్ని గిరిజన ప్రాంతాల జీవన విధానం మరియు సంస్కృతిని ప్రభావితం చేసే చట్టాలను రూపొందించకుండా పార్లమెంటును కూడా నిరోధిస్తుంది. గిరిజనులు తమ అసలైన విశ్వాసాలు, సంస్కృతి, ఆచారాలు మొదలైనవాటిని తిరస్కరించి మరో మతంలోకి మారినప్పుడు గిరిజన రిజర్వేషన్ యొక్క ప్రాథమిక ప్రయోజనం అర్థరహితమవుతుంది.

ఇక్కడ తలెత్తే ఒక ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే.. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని మార్చుకుని ఇతర మతంలోకి మారినప్పుడు, అతను సమాజం అనుసరించే అసలు సంస్కృతి, సంప్రదాయాలు మరియు జీవన విధానాన్ని ఎలా కొనసాగించగలడు. కమ్యూనిటీ గుర్తింపును కోల్పోయిన వారికి అసలు రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి.

 

source – vsk bharath