
మధ్యప్రదేశ్‌లో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉమాభారతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. మందుబాబులు మద్యం మానేసి ఆవు పాలు తాగాలని కోరారు. నివారీ జిల్లాలోని ఓర్చాలో మద్యం దుకాణం ముందు నిలబడి ‘‘షారబ్ నహీ, దూద్ పియో’’ (మద్యం కాదు పాలు తాగండి) అంటూ ఉమాభారతి మందుబాబులను కోరారు.
గతేడాది జూన్ నెలలో ఇదే మద్యం దుకాణంపై ఉమాభారతి ఆవు పేడను విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో మద్యపానానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి ఉమా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా విడుదల చేసే మద్యం పాలసీకి తగిన సవరణలు చేయాలని, డి-అడిక్షన్‌ను ప్రోత్సహించడానికి మరిన్ని నియంత్రణలను చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
గత నెల ఉమాభారతి భోపాల్‌లోని ఒక ఆలయానికి చేరుకున్న ఉమాభారతి మద్యం పాలసీ ప్రకటన వచ్చేవరకు అక్కడే ఉంటానని ప్రకటించారు. మొత్తంమీద ఉమాభారతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం అనేక మలుపులు తిరుగుతోంది.





