News

చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి

361views

చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్‌ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం కొవిడ్‌తో మృతి చెందగా.. 11,977 మందికి కొవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చైనా జీరో కొవిడ్‌ విధానాన్ని గత నెలలో ఎత్తివేయడంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైంది.