
ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ నిర్వహించనున్నాయి. ఈ పరేడ్‌ను కనులారా తిలకించడానికి అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ పరేడ్‌ను వీక్షించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.
రిపబ్లిక్ డే పరేడ్- 2023 కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ www.aamantran.mod.gov.in ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ టికెట్ బుకింగ్ చేసుకుంటే ఈ-వైట్స్ పొందవచ్చు.
బుక్ చేసుకునే విధానం ఇలా..
అధికారిక వెబ్‌సైట్ www.aamantran.mod.gov.in ఓపెన్ చేసి.. వివరాలు నమోదు చేసుకోవాలి. అదే రిజిస్టర్ యూజర్ అయితే, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. దీంతో ఓటీపీ జనరేట్ అవుతుంది. ఒక వేళ మీరు కొత్త యూజర్ అయితే, పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఫిల్ చేయాలి. ఆ తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాలి. దీంతో టికెట్ బుకింగ్ పేజీ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్ రకాన్ని(FDR-రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, రిహార్సల్-బీటింగ్ ది రిట్రీట్, బీటింగ్ ది రిట్రీట్ – FDR, బీటింగ్ ది రిట్రీట్ సెర్మనీ) ఇందులో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.
అనంతరం ఎన్‌క్లోజర్ నార్త్ లేదా సౌత్ సెలక్ట్ చేసుకోవాలి.. మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, ID కార్డ్ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.. ఆపై పేమెంట్ చేయాలి.. చివరగా రిపబ్లిక్ డే పరేడ్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
టికెట్ ధర ఎంతంటే..
టికెట్ల ధరలను మూడు కేటగిరీలుగా విభజించారు. రూ.20, రూ.100, రూ.500 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక డివైజ్ నుంచి గరిష్టంగా 10 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయడానికి కౌంటర్స్‌ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 25వ తేదీ వరకు ఈ కౌంటర్స్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (గేట్ నంబర్ 1), జంతర్ మంతర్ (మెయిన్ గేట్), సేన భవన్ (గేట్ నంబర్ 2), పార్లమెంట్ హౌస్ రిసెప్షన్ ఆఫీస్ (ఎంపీల కోసం) వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవీ..
కౌంటర్స్ వద్ద టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. రిపబ్లిక్ డే/బీటింగ్ రిట్రీట్ రిహార్సల్ వేడుకను సందర్శించడానికి కూడా ఈ కార్డ్‌లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఈ కార్యక్రమానికి అనుమతించరు. ఒకసారి విక్రయించిన టిక్కెట్లు తిరిగి వాపస్ తీసుకోరు.





