
349views
బెంగళూరులోని యశ్వంతపుర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంల మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 19న తిరగనుంది. యశ్వంతపురంలో మధ్యాహ్నం 3.50కు బయల్దేరే (07154) రైలు మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, అనంతపురం, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు, దోనకొండ, నరసరావు పేట, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మార్గంలో ప్రయాణించి నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలుకు రెండు 2 టైర్ ఏసీ బోగీలు, ఒక 3 టైర్ ఏసీ బోగీ, 11 స్లీపర్ క్లాస్ బోగీలు, ఆరు సెకండ్‌క్లాస్ జనరల్ బోగీలు ఉంటాయని నైరుతి రైల్వే తెలిపింది.





