
326views
రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రదర్శనను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తుండటంతో ఈ సారి వేదికను మార్చారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవాన్ని విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పుస్తక మహోత్సం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాఠకులకు త్వరలోనే సాహిత్య దాహం తీరనుంది.





