
సంఘమిత్ర సేవా సమితి నంద్యాల( సేవా భారతి అనుబంధం ) ఆధ్వర్యంలో వేసవి కాలం మండే ఎండలో తిరిగే పల్లె ప్రజల, నగర ప్రజలను ఎండల నుండి కాస్త సేద తీర్చడం కోసం ఈ సంవత్సరం సేవా భారతి కార్యకర్తలు నంద్యాల నగరంలో 14.04.2019 ఆదివారం నాడు స్వామి వివేకానంద సెంటర్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది . ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన కుండలకు నీటిని నింపుతూ దారిన వెళ్ళే వారి దాహం తీరుస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని చలివేంద్రం దగ్గర శ్రీ రామచంద్రుని చిత్ర పటానికి సేవాభారతి ఆంధ్ర ప్రదేశ్ సహ కార్యదర్శి శ్రీ మనోహర్ పుష్ప మాలార్పణ చేసి ,పూజ చేశారు .ముఖ్య అతిగా విచ్చేసిన శ్రీ ఉమహేశ్వర మాట్లాడుతూ శ్రీరాముడు వసంత ఋతువులో, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడని తెలిపారు. ఆ మహనీయుని జన్మ దినమును మనం శ్రీ రామ నవమి గా జరుపుకుంటామన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరుగుతుంది అని, శ్రీ రాముని జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకోవాలని, రామాయణం వంటి మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరు చదివి, జీవితాలను మలచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం పానకం ,వడ పప్పు ,ప్రసాదం అందరికి అందజేశారు .
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సేవాసమితి సభ్యులు , దాతలు , సేవా భారతి కార్యకర్తలు లోకేష్ బాబు ,మోహన్ లాల్ ,మోహన్ బిజెపి కార్యకర్తలు రాధాకృష్ణ గారు , సురేంద్ర గారు , వివిధ క్షేత్ర కార్యకర్తలు నాగ దీప , కేశవ రాంప్రసాద్, పలువురు యువకులు పాల్గొన్నారు





