భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ మోహన్‌భగవత్

భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రికలైన ‘ఆర్గనైజర్, ‘పాంచజన్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, జెండర్) వర్గాలను సమర్థిస్తూ సైతం మాట్లాడారు. సమాజంలో ఈ వర్గాలకూ సముచిత బై సెక్సువల్, ట్రాన్స్ స్థానం ఉండాలని, ఈ దిశగా సంఘ్ పరివార్ ప్రచారం చేస్తుందన్నారు. “మన సమాజంలో వీరు కూడా భాగమేనని అన్నారు. మానవులు ఉన్నంత కాలం ఈ జీవనవిధానం కొనసాగుతుందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అనుసరించే మార్గాలన్నీ నిష్ఫలం అవుతాయని.. కాబట్టి.. సంఘ్ వారికి అండగా నిలుస్తుంది అని అన్నారు. గత వెయ్యేళ్లుగా హిందూ సమాజం విదేశీ దాడులు, సంస్కృతులు, కుట్రలతో యుద్ధం చేస్తోందన్నారు. వీటన్నింటితో హిందూ సమాజం కూడా మేల్కొందని, యుద్ధంలో ఉన్నవారు దూకుడు చూపడం సహజమన్నారు. గతంలో అఖండ భారతావనిగా ఉన్న ఇండియా ప్రధానమైన హిందూత్వ భావాన్ని మరచిన ప్రతిసారీ విభజనకు గురైందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హిందుస్థాన్ అన్నది హిందుస్థాన్గానే కొనసాగాలన్నారు. “దేశ ప్రయోజనాలు, హిందువుల బాగోగుల వరకు రాజకీయాల్లో మా జోక్యం ఉంటుంది. స్వయం సేవకుల చేతికి ఇప్పుడు రాజకీయ అధికారం వచ్చింది. ఓ రాజకీయ పార్టీ ద్వారా వారు ఈ స్థాయికి చేరుకున్న విషయం ప్రజలు మరచిపోయారు” అని మోహన్ భాగవత్ వివరించారు.





