News

చైనాలో మళ్ళీ కరోనా విజృంభణ.. 6 నెలల తర్వాత తొలి మరణం

370views

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్‌లో ఓ వృద్ధుడు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరు నెలల అనంతరం ఇదే తొలి కొవిడ్ మరణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నవేళ.. రోజురోజుకూ చైనాలో పరిస్థితి భిన్నంగా మారుతోంది. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు చైనాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్టు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా నగరాల్లో కొవిడ్‌ విజృంభిస్తున్నప్పటికీ.. మరణాలు నమోదు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తర్వాత ఇప్పుడు బీజింగ్‌కు చెందిన 87 ఏళ్ళ వృద్ధుడు చనిపోయినట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి