News

చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా

391views

బీజింగ్‌: చైనాలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘ్వాంగ్‌జౌవ్‌, ఛాంగ్‌క్వింగ్‌ నగరాల్లో.. దాదాపు 50 లక్షల మంది కఠినా లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య ఉన్నారు. వైరస్‌ కట్టడికి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నా ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం అక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి