News

అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్

352views

న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) బీమా సుగమ్​ పేరుతో ఒక ప్లాట్​ఫారమ్​ను అందుబాటులోకి తేనుంది.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పోర్టల్​ మొదలవుతుంది. దీనివల్ల ఇన్సూరెన్స్​ మార్కెట్​ పూర్తిగా డిజిటైజ్​ అవుతుందని, పాలసీదారులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోర్టల్​ద్వారా అన్ని కంపెనీల పాలసీలను కొనుక్కోవచ్చు. ఇతర సేవలను పొందవచ్చు.

లైఫ్​, నాన్​–లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కంపెనీల నుంచి కోట్స్​ పొందవచ్చు. పాలసీ సేవలతోపాటు పాలసీ వివరాలను భద్రపరచడం, క్లెయిమ్స్​సెటిల్​ చేయడం, బీమా ఏజెంట్లను మార్చుకోవడం వంటి పనులకు బీమా సుగమ్​ పోర్టల్​ను వాడుకోవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి