
445views
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. గుజరాత్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.





