
భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని ఈ నెల 21న దర్శించుకుంది. ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడింది. దేవాలయ భూములు కబ్జాకు గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీరంతా ఏం చేస్తున్నారని నిలదీసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని దేవాలయ భూములు కబ్జా చేస్తున్నట్టు దేవాలయ అధికారులు పరిషత్ బృందానికి తెలిపారు.
తీర్పులు కూడా దేవాలయ భూమిగా గుర్తించాయని, వందలకొద్దీ తీర్పులు కూడా వెల్లడించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆధారాలతో సహా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేవాలయ భూములను కాపాడుకుంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నందున దేవుడి మాన్యాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





