News

అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి!

378views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వచ్చేయాలని హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు వెళ్ళాలనుకునేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.

ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌కు చెందిన ఖెర్సోన్, జాపొరిజియ, లుహాన్స్క్, డోనెట్క్స్ అనే నాలుగు ప్రాంతాలను గత నెలలో రష్యా తమ భూభాగంగా పేర్కొంది. వీటిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలవకముందే తమ ఆధీనంలోకి తీసుకున్న ఖెర్సోన్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రష్యా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి