News

బ్రిటన్‌లో కీలక పరిణామాలు.. తాజాగా ప్రధాని రాజీనామా

336views

లండన్‌: బ్రిటన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత లిజ్‌ట్రస్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమె కేవలం 45 రోజుల పాటు పదవిలో ఉన్నారు. బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా లిజ్‌ట్రస్‌ నిలిచారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి