
313views
గాంధీనగర్: పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవాడియాలోని ఏక్తా నగర్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో కలిసి ప్రధాని మోదీ మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించారు. మిషన్ లైఫ్ కార్యాచరణ ప్రణాళిక, మిషన్ లైఫ్ లోగో, ట్యాగ్ లైన్లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ నినాదాన్ని మిషన్ లైఫ్ మరింత బలోపేతం చేస్తుందన్నారు మోదీ. వాతావరణంపై ప్రజల సామూహిక విధానాన్ని మార్చే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం దీని లక్ష్యమని స్పష్టం చేశారు.





