News

షూటింగ్‌లో భారత షూటర్ల పతకాల వేట

395views

న్యూఢిల్లీ: ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్‌ యింగ్‌ షెన్‌పై గెలుపొందింది. జూనియర్‌ మహిళల 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్‌ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి