
509views
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్ అయిన లష్కరే తోయిబా ‘హైబ్రిడ్ ఉగ్రవాది’ ఇమ్రాన్ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. మరో ముష్కరుడి కోసం బుధవారం ఉదయం సోదాలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాది తమపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, అప్పుడు హైబ్రిడ్ ఉగ్రవాది చనిపోయాడని చెప్పారు.





