News

యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి రూ.లక్ష విరాళం

452views

మంగళూరు: సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఓ వృద్ధురాలు నిలిచారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆ యాచకురాలు కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఉడిపి జిల్లా కుందాపుర్ తాలూకాకు చెందిన అశ్వత్థమ్మ(80) చేసిన ఈ పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు పలు ఆలయాలకు సుమారు రూ.9 లక్షల విరాళంగా అందించానని ఆమె తెలిపారు. మంగళూరు శివార్లలోని ముల్కిలోని బప్పనాడు శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయానికి వచ్చిన ఆమె అన్నదాన కార్యక్రమం కోసం లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. విరాళాన్ని స్వీకరించిన ఆలయ సిబ్బంది ఆమెకు ప్రసాదం అందజేసి సన్మానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి