
359views
సత్నా: మధ్యప్రదేశ్ సత్నాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పెప్టెక్ సిటీ టౌన్షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్ళి, ఖాళీ ప్రదేశంలో పడేశారు. ఈ ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరలైన ఈ వీడియో అధికారుల దృష్టి చేరింది. దీంతో జేసీబీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Source: EtvBharat





