News

ఆలయంలో ఫ్యాషన్ షో… అడ్డుకున్న భ‌జ‌రంగ ద‌ళ్‌!(వీడియో)

1.1kviews

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయంలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. హిందూ మతపరమైన ప్రదేశంలో ఫ్యాషన్ షోపై భజరంగ్ దళ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది నిలిచిపోయింది. తెలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాసర్ ఆలయంలో ఎఫ్‌డిసిఎ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఆరిఫ్, మనీష్ సోనీలు ఫ్యాషన్ షో నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

ఈ వీడియోలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ, ఆలయంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంపై నిర్వాహకులను వివరణ కోరడం చూడవచ్చు. హిజాబ్ ధరించిన మహిళ నిలబడి ఈవెంట్‌ను నిర్వాహకుల వైపు నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా వీడియోలో చూడవచ్చు. ఘర్షణ సమయంలో, ఈ సంఘటన హిందువుల మతపరమైన మనోభావాలను కించపరిచిందని భజరంగ్ దళ్ కార్యకర్తలు పేర్కొన్నారు.

ఆలయ హాలును ఫ్యాషన్ షో వేదికగా మార్చారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సందర్శకులను కూడా ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. భ‌జరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ రవి వాధ్వాని నిర్వాహకులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వాధ్వాని ప్రకారం, ఈ సంఘటనపై తెలిబంధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. మతపరమైన భావాలను దెబ్బతీసినందుకు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్ చేశారు. ఈ ఘటన హిందువుల మత భావాలను కించపరిచేలా ఉందని, దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని వాధ్వానీ వాదించారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి