
337views
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి చేరిందని పాక్ అధికారులు తెలిపారు. వరదల ధాటికి నిరాశ్రయులైన లక్షల మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పించిన శిబిరాల్లోనూ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. పాకిస్తాన్‌లో అంటు వ్యాధుల విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.





