
290views
న్యూఢిల్లీ: భారత్ వచ్చే పదేళ్ళలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్ రీ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించేందుకు భారత్.. వచ్చే పదేళ్ల కాలం పాటు ఏటా 14 శాతం మేర బీమా ప్రీమియంలో వృద్ధి నమోదు కావాలని సూచించింది. ప్రస్తుతం బీమా ప్రీమియం పరంగా భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత జీవిత బీమా రంగం 2022లో 6.6 శాతం మేర, 2023 నుంచి 7.1 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని స్విస్‌రీ అంచనా వేసింది.





