
470views
నాగ్‌పూర్: ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 దాకా (హైదరాబాద్ స్టేట్ విలీనమై 75 ఏళ్ళు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) నిర్ణయించింది. రాజకీయరంగు లేకుండా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి నియంతృత్వ పాలనను ఎత్తిచూపేలా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు.
ఏడాదిపాటు వీటి నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ఇతర భావసారూప్య శక్తులు, వ్యక్తులతో ఒక సమన్వయ కమిటీ ద్వారా చేపట్టనున్నట్టు సమాచారం. ఈ సమితికి గౌరవాధ్యక్షుడిగా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా డాక్టర్ వంశతిలక్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమితి లక్ష్యాలు, ఆలోచనలు, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించనున్నారు.





