News

ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త

394views

పంజాబ్‌: మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్‌లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఈ ఘటన జూలై 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని తల్వాండి సాబో నియోజవర్గానికి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌కు ఆమె భర్తకు మధ్య తన నివాసంలో ఏదో విషయమై గొడవ చోటుచేసుకుంది. భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు దూరంగా తీసుకొచ్చారు.

ఈ క్రమంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్ళీ వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆవేశానికి లోనైన భర్త అందరి ముందే ఆమెపై దాడికి దిగాడు. ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే పక్కన ఉన్నవారు ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పంజాయ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ విచారం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి