News

10 నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ వివిధ సంస్థ‌ల స‌మ‌న్వ‌య స‌మావేశం

376views

నాగ్‌పూర్‌: స‌మాజంలోని వివిధ రంగాల్లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రేర‌ణ‌తో ప‌నిచేస్తున్న వివిధ సంస్థ‌ల ముఖ్య ప్ర‌తినిధుల స‌మ‌న్వ‌య స‌మావేశం(అఖిల భార‌తీయ స‌మ‌న్వ‌య్ భైఠ‌క్‌) ఈ నెల ప‌దోతేదీ నుంచి 13 వ‌ర‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్ సునీల్ అంబేక‌ర్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఏడాది ఒక‌సారి జ‌రిగే ఈ జాతీయ స్థాయి స‌మ‌న్వ‌య స‌మావేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌, స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బాలేతోపాటు అయిదుగురు స‌హ స‌ర్ కార్య‌వాహ‌లు, ఇత‌ర సంఘ్ ముఖ్య కార్య‌క‌ర్త‌లు పాల్గొంటార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి