News

తైవాన్‌లో అడుగు పెట్టొద్దు… అమెరికాకు చైనా మ‌రోసారి హెచ్చ‌రిక‌!

429views

వాషింగ్ట‌న్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది.

రిపబ్లికన్ సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్‌ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేఖ‌ర్ల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి