News

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు

249views
  • భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత

భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) \ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ  కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్‌ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్‌ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి