News

అంతర్జాతీయ సర్వే… ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోడీ నెంబర్ వన్

380views

వాషింగ్ట‌న్‌: పాలనలో ప్రపంచ దేశాధినేతలను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్​తో అయిదో స్థానంలో నిలిచారు.

63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉన్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్‌’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి