News

బంగారంతో 18 అడుగుల ఎత్తులో భారీ గణపతి

348views

ల‌క్నో: యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 1‍8 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర లోహాలు ఉపయోగించి చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు. కొవిడ్​ ముందు ఇక్కడ భారీ ఎల్​ఈడీ వినాయకుడు దర్శనమివ్వగా ఈ ఏడాది రానున్న స్వర్ణ గణేశుడిని స్వాగతించడానికి ఛందౌసీ వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి