News

సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడే దేశానికి సంపూర్ణ భ‌ద్ర‌త‌: రాజ్‌నాథ్ సింగ్

405views

మణిపూర్‌: సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ భ‌ద్ర‌త‌లో ఉన్న‌ట్ట‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్‌లోని మంత్రి అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్‌క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల రూపంలో ఎదురవుతున్న సవాళ్ళ‌ను అధిగమించి సైనికులు మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని మెరుగుపరచడంలో విజయం సాధించారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అధికారులు, సైనికులు ధైర్యంగా, దృఢ నిశ్చయంతో విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ దళాల మధ్య నిలబడటం గర్వంగా ఉందని ఆయన చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి