News

ఎదురుకాల్పులు!

247views

భద్రాద్రి కొత్తగూడెం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్టు స‌మాచారం. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీప అడవుల్లో కూంబింగ్‌ పార్టీకి మావోయిస్టులు తారపడగా తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలిసింది . దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్టుసమాచారం. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Source: Mana sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి