News

పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం!

364views

పంజాబ్‌: పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్‌ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్టు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్​ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమృత్‌సర్‌ పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి