
342views
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి వి సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్ఠాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
బర్మింగ్‌హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ (21-15, 21-13) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ వరుస సెట్లలో పైచేయి సాధించి విజేతగా నిలిచింది.





