News

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం

430views

ఇరాన్‌: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె పక్క సీటు వైపుకి చూస్తూ కన్ను గీటుతుంటుంది.

తర్వాత గ్రీనరీ ఉన్న ప్రదేశానికి చేరుకుని మాగ్నమ్ ఐస్‌ క్రీమ్‌ కొరుకుతున్నట్టు చూపించారు. యువతి వస్త్ర‌ధారణను ఐస్‌క్రీమ్‌తో పోల్చుతూ మరో యాడ్ రూపొందించారు. ఈ ప్రకటనలతో మహిళల విలువను తగ్గించారని ఇరాన్‌ సంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్‌ మత శాఖ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పైగా, అనేక అపార్ధాలు కలిగించే విధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ యాడ్‌ చేసిన డోమినో కంపెనీపై కేసులు పెట్టాలని ఇరాన్‌ లోని మతగురువులు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళల విలువలకు అవమానంగా ఈ యాడ్‌ ఉందని అక్కడి మతగురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని రకాల వాణిజ్య ప్రకటనలలో మహిళలు నటించడంపై నిషేధాన్ని విధించాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి