
408views
తిరుపతి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ తన ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాలకు తలమానికమైన పుంగనూరు జాతి పొట్టిరకం ఆవుల పరిరక్షణ, మేలు జాతి దూడల పునరుత్పత్తికి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. పలమనేరులోని వర్సిటీ పశుపరిశోధన స్థానంలో ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.1.8 కోట్ల కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) నిధులు వెచ్చించింది.





