
30views
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించనుంది. రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం, తదితర దర్శనాలను రద్దు చేసింది. ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్టు పేర్కొంది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం ఉంటుందని వెల్లడించింది.