
390views
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల జూడోలో భారత్‌కు మూడో పతకం దక్కింది. ఇప్పటికే సుశీల దేవి రజతం, విజయ్ కుమార్ కాంస్యం నెగ్గగా.. తాజాగా తూలిక మాన్ వెండి పతకం పట్టేసింది. బుధవారం మహిళల +78 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 1ఎస్2-10 తేడాతో సారా అడ్లింగ్‌టాన్ (స్కాట్లాండ్) చేతిలో ఓడింది. తొలిసారి ఈ క్రీడల్లో బరిలో దిగిన తూలిక.. మెరుగైన ప్రదర్శనతో తుది పోరు చేరింది. సెమీస్‌లో ఓ దశలో వెనకబడ్డ ఆమె తిరిగి పుంజుకుని ‘ఇప్పాన్’ (ప్రత్యర్థి వీపును మ్యాట్‌కు తగిలేలా తోయడం లేదా 20 సెకన్ల పాటు ప్రత్యర్థిని లేవకుండా ఉంచడం)తో ఆండ్రూస్ (న్యూజిలాండ్)ను చిత్తుచేసింది.
Source: EtvBharat





