News

ఉత్తర ప్రదేశ్‌లో నీటిపై తేలియాడే రామసేతు రాయి… పూజలు చేస్తున్న భక్తులు

533views

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్‌ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్‌ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి