
416views
చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా 75 వేల కిలోల మాదక ద్రవ్యాలను దహనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం ఇప్పటికే ఆ మార్కును దాటింది. అందువల్ల లక్ష కిలోలను కాల్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతా వంటి నాలుగు ప్రాంతాల్లో అధికారులు 30వేల కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలను దహనం చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ చంఢీగఢ్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అధికారులు ఈ 30 వేల కిలోల డ్రగ్స్‌ను మంటల్లో కాల్చారు.
Source: Nijamtoday





