News

ఖాన్‌ వ‌ల్లే హిందీ చిత్రపరిశ్రమ సర్వనాశనం: కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

529views

ముంబై: బాలీవుడ్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన ‘ఢిల్లీ ఫైల్స్’ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్​ చేసిన ఓ ట్వీట్​ బాలీవుడ్​లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా బాలీవుడ్​ స్టార్​ హీరోలను ఆయన టార్గెట్​ చేశారు.

ట్విట్టర్​ వేదికగా.. షారుక్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘కింగ్​లు, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీయాలి. బాలీవుడ్​ను ప్రజల పరిశ్రమగా మార్చాలి. అప్పుడు అది ప్రపంచ సినిమాను నడిపిస్తుంది’ అని ట్వీట్‌ చేశారు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన చేసిన ఈ ట్వీట్​.. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను పరోక్షంగా అన్నట్టు స్పష్టమవుతుందంటున్నారు నెటిజన్లు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి