
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌లో శివకుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో ఏడు పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందులో ఓ ఫోర్ ఉంది. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.
శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ 40 మ్యాచులు(1334 పరుగులు, 45వికెట్లు), 16 టీ20లు(342 రన్స్, 15 వికెట్లు) ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆఖరిసారిగా ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధనను పూర్తి చేసుకున్న అతడికి ఇటీవలే అక్కడి జట్టులో చోటు దక్కింది.
Source: EtvBharat





