News

నుపుర్‌కు మద్దతు ప‌లికిన ఉమేష్ కోల్హే హ‌త్య‌! నిందితులంతా ముస్లింలే..

344views

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న వైద్య నిపుణుడు ఉమేష్ కోల్హే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ కేసులో నలుగురు నిందితులు అబ్దుల్, షోయబ్, ముదస్సిర్, షారూఖ్‌లను అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు తమ నేరాన్ని అంగీకరించడమే కాకుండా ఉమేష్ కోల్హే హత్యకు ముందు గత కొన్ని రోజులుగా అతని రోజువారీ కార్యకలాపాలపై నిఘా ఉంచినట్టు తెలిపారు.

నివేదికల ప్రకారం, మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు, మొత్తం సంఖ్య ఏడుకి చేరుకుంది. నిందితుల్లో చాలా మంది ప్రధాన సూత్రధారి షేక్ ఇర్ఫాన్ నిర్వహిస్తున్న ఎన్జీవో (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్)లో పనిచేసినట్టు వెలుగులోకి వచ్చింది.

వెటర్నరీ డాక్టర్ యూసుఫ్ ఖాన్ ఈ హత్యకు వారందరినీ ప్రేరేపించాడు. యూసుఫ్ ఖాన్ ఉమేష్ కోల్హేకు మంచి స్నేహితుడు. అతను చాలాసార్లు అతనికి సహాయం చేశాడు. బ్లాక్ ఫ్రీడమ్ అనే ఒక‌ వాట్సాప్ గ్రూప్‌లో వీరంద‌రూ స‌భ్యులు. డాక్టర్ యూసుఫ్ ఖాన్ ఆ గ్రూప్‌ అడ్మిన్. ఇందులో ఉమేష్ కోల్హే భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. యూసుఫ్ ఖాన్ ఈ సమాచారాన్ని రహెబరియా అనే గ్రూప్‌లో పంచుకున్నారు. ఉమేష్ కోల్హేకు వ్యతిరేకంగా అతని స్నేహితులు షేక్ ఇర్ఫాన్, ఇతరులను రెచ్చగొట్టారు. ఇది ఉమేష్ హత్యకు దారితీసింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి