
399views
న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత మే నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఒక నెలలో 19 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇందులో ఎక్కువ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ప్రధానంగా ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని నివేదిక తెలిపింది. లేటెస్ట్ నివేదికలో మే 1, 2022 నుంచి మే 31, 2022 మధ్య కాలానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది.





