News

పోలీసు కస్టడీకి తీస్తా సెతల్వాడ్‌

377views

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను గుజరాత్‌ సర్కారు ఏర్పాటు చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం డీఐజీ దీపన్‌ భాద్రాన్‌ నేతృత్వంలో సిట్‌ కొనసాగుతుంది.

అరెస్టయిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌, మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌లను అహ్మదాబాద్‌ కోర్టు వారం రోజుల (జులై 1 వరకు) పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది. శనివారం ముంబైలో అదుపులోకి తీసుకున్న తీస్తా సెతల్వాడ్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చూపారు.

ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, నేర విచారణ వ్యవహారాలను అవమానించడం, గాయపర్చడానికి కారణం కావడం తదితర ఆరోపణలు ఆమెకు వ్యతిరేకంగా తాజా నమోదు కావడంపై ఈ అరెస్టు జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం గుజరాత్ మాజీ డిజిపి ఆర్‌బి శ్రీకుమార్‌ను కూడా క్రైమ్ బ్రాంచి అరెస్టు చేసింది. మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వేరే కేసులో ఆయన జైల్లో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి