
తిరుపతి: అగ్నిపథ్ నోటిఫికేషన్‌కు తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు భద్రతను రప్పించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు.
అగ్నిపథ్ స్కీమ్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఓ ప్రకటన చేశారు. ఆర్మీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న యువతకు వయోపరిమితిని 23 ఏళ్ళకు పెంచినట్టు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని, కొవిడ్ సమయంలోనూ తీవ్రంగా కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. గడిచిన రెండేళ్ళు కొవిడ్ ఆంక్షల వల్ల ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించలేదన్నారు. రిక్రూట్మెంట్కు చెందిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు.





