News

జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర కుట్ర భ‌గ్నం!

421views
  • 15 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం

పుల్వామా: జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు, భద్రతా సిబ్బంది. లాసిపోరా ప్రాంతం అర్ముల్లా గ్రామంలోని ఓ తోట​లో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర కుట్రకు సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఐఈడీని స్వాధీనం చేసుకోవటం ద్వారా భారీ కుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఆ పేలుడు పదార్థాలు సుమారు 15 కిలోలు ఉంటాయి. పుల్వామా, లిట్టెర్​ ప్రాంతంలోని ఆర్ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు వాటిని ఓ తోటలో పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి