News

ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం

561views

విజయనగరం: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గురునాయుడు(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాలుర 55 కేజీల ఈవెంట్‌లో గురునాయుడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

మొత్తం 230 కేజీల బరువు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇక సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్‌ 229 కేజీలతో రెండో స్థానంలో నిలవగా.. కజకిస్థాన్‌కు చెందిన్‌ ఉమ్రోవ్‌ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.

మరోవైపు బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య డాల్వి 148 కేజీల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీలో ఫిలీప్పీన్స్‌కు చెందిన జే రామోస్‌ 155 కేజీల బరువుతో తొలి స్థానం సాధించగా వెనుజులాకు చెందిన మాంటిల్లా 153 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి